అల్లు అరవింద్ చేతిలో అఖిల్ అదృష్టం

ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:04 IST)
అక్కినేని మూడోతరం హీరో అఖిల్ అక్కినేని. అతని సినీ కెరీర్‌లో సరైన్ హిట్ పడలేదు. ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తాజాగా, 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకురాగా, ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 
 
దీంతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై నమ్మకం పెట్టుకున్నాడు. అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై అఖిల్ అక్కినేని హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు సిద్ధం కాగా, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాయి. మార్చిలో ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 
 
ఈ చిత్రాన్ని 'గీతా గోవిందం' ఫేమ్ ప‌ర‌శురాం లేదా 'బొమ్మ‌రిల్లు' భాస్కర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు స్క్రిప్ట్ వ‌ర్క్స్‌తో బిజీగా ఉండ‌గా, నచ్చిన స్క్రిప్ట్‌తో అఖిల్ ముందుకెళ్ళ‌నున్నాడు. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు