బిగ్ బాస్‌లో లైంగిక వేధింపులు... కన్నడ నటి ఫిర్యాదు...

బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (15:37 IST)
బిగ్ బాస్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల దక్షిణ భారతదేశంలో కూడా ఈ రియాలిటీ షో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళంలో రెండు సీజన్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో మూడవ సీజన్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు షో నిర్వాహకులు. అయితే ఈ షో వివాదాలకు నిలయం. 
 
ఇటీవల కన్నడ బిగ్ బాస్‌లో పాల్గొన్న నటి కవిత అనే ఓ లేడీ పార్టిసిపెంట్ తను లైంగిక వేధింపులకు గురైనట్లు స్వయంగా మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.
 
హౌస్ నుండి బయటకి వచ్చాక కన్నడ నటి కవిత గౌడ వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. హౌస్‌లో జరిగిన సూపర్ హీరోస్, సూపర్ విలన్స్ టాస్క్ జరుగుతున్నప్పుడు సహ పార్టిసిపెంట్ యాండీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా తనను వేధించాడని ఆరోపించింది. 
 
ఈ విషయం గురించి నేను బిగ్ బాస్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, అందుకే మహిళా కమీషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని యాండీ వద్ద ప్రస్తావించగా తాను నిబంధనల ప్రకారమే ఆడానని, బహుశా ఓటమి తట్టుకోలేక ఈ ఆరోపణలు చేస్తోందని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు