రెండోసారి కరోనా వైరస్ బారినపడిన అక్షయ్ కుమార్

ఆదివారం, 15 మే 2022 (09:47 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. గత యేడాది ఏప్రిల్ నెలలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఇపుడు మళ్లీ ఆ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. పైగా, త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ కరోనా వైరస్ సోకడంతో ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా దూరమయ్యారు. 
 
కాగా, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ త్వరలోనే యష్ రాజ్ ఫిల్మ్ పీరియడ్ డ్రామా "పృథ్విరాజ్" సినిమాతో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాడు. గత యేడాది ఏప్రిల్ నెలలో అక్షయ్ కుమార్ తొలిసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ ఉదయం తనకు కరోనా వైరస్ సోకిందని, ఈ విషయాన్ని అందరితోనూ పంచుకుంటున్నానని ఆయన వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు