తెలుగు బుల్లితెర యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాపై ఇప్పటికే యాంకర్ అనసూయ, నటి శ్రీరెడ్డిలు స్పందించారు. ఇపుడు యాంకర్ లాస్య కూడా కామెంట్స్ చేసింది. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ బయటకు వచ్చినట్టుగానే అమెరికాలో జరుగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు కూడా బయటకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.
అమెరికాలో షాపింగ్‌కి "ఓకే" అంటే ఇక అన్నింటికి అంగీకరించినట్టేనని తెలిపింది. కానీ, టాలీవుడ్లో మాత్రం కమిట్మెంట్ ఇవ్వాలని అడుగుతారనీ, అమెరికాలో మాత్రం షాపింగ్‌కి వస్తారా అని అడుగుతారని వివరించింది. ఈ షాపింగ్‌కు ఓకే అంటే మాత్రం ఇక అన్నింటికీ సమ్మతించినట్టేనని తెలిపింది.
ఇకపోతే, తన కెరీర్ ఆరంభంలో పలు ఈవెంట్లలో తాను కూడా పాల్గొనే దానినని, కానీ, ఇక్కడి ఆర్గనైజర్లు తప్పుగా ప్రవర్తించేవారని ఆరోపించారు. ఓసారి, ఓ ఆర్గనైజర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపింది. పద్ధతిగా సంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్లను కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారనీ, అందుకే ఈవెంట్ దరిదాపుల్లోకి తాను వెళ్లడం లేదని, దానికి కారణం ఇలాంటి చెత్త వెధవలేనంటూ లాస్య మండిపడ్డారు.