Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

సోమవారం, 14 ఏప్రియల్ 2025 (12:56 IST)
Anna konidala- Tirumala
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  సతీమణి శ్రీమతి అన్నా కొణిదల దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని, తలనీలాలు సమర్పించారు.
 
Anna konidala at Gayatri sadanam
గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదలకి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించుకున్నారు.
 
Anna at Tiruma
తన కుటుంబంతో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 12, శనివారం రాత్రి తన భార్య అన్నా లెజ్నెవా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌తో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్ మార్క్‌ను చేతుల్లో మోసుకెళ్తుండగా, అన్నా పక్కనే నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వారం ప్రారంభంలో, ఏప్రిల్ 9న, సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన ఒక పెద్ద అగ్ని ప్రమాదంలో మార్క్ గాయపడ్డాడు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడికి అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలు అయ్యాయి మరియు పొగ పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడింది. ఈ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ తన కొడుకుతో ఉండటానికి వెంటనే సింగపూర్ వెళ్లాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు