క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ఠాగూర్

సోమవారం, 14 ఏప్రియల్ 2025 (09:01 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద ఆమెకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 

వెంకన్న సామి ఎంత మురిసిపోయాడొ మరి

47 sec
పది మందికి ఆదర్శం #AnnaLezneva @PawanKalyan @JanaSenaParty pic.twitter.com/cILX8qqjhO

— ???????????? ???????????????????????????????????????????? (@TheBeast_619) April 14, 2025
కాగా, ఆదివారం రాత్రే తిరుమలకు చేరుకున్న అన్నా లెజినోవా శ్రీవారికి తలనీలాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లోని  స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విషయం తెల్సిందే. ఈ నేపధ్యంలో  తమ కుమారుడు సురక్షితంగా బైటపడటంతో శ్రీవారి సేవలో అన్నా లెజినోవా  పాల్గొన్నారు.
 
అంతకుముందు ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె సోమవారం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడినందుకు ఆమె స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. 

 

#WATCH | Tirupati, Andhra Pradesh | Anna Lezhneva, wife of Andhra Pradesh Deputy CM Pawan Kalyan, visits and offers prayers at Sri Venkateswara Temple in Tirumala. pic.twitter.com/cT80znEttc

— ANI (@ANI) April 14, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు