టాలీవుడ్ తారలంతా ప్రస్తుతం అమెరికాను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నారైలను లక్ష్యంగా చేసుకుని సినిమాను ప్రమోట్ చేస్తే కలెక్షన్ల వర్షం కురుస్తుందని దర్శకనిర్మాతలతో పాటు సినీ తారలందరూ నమ్ముతున్నారు. ఇటీవల శ్రీమంతుడు ప్రమోషన్ కోసం మహేష్ అమెరికా వెళ్లొచ్చాడు. అప్పట్నుంచి ఒకరొకరుగా అమెరికా బాట పట్టారు. భలే మగాడు నాని కూడా అమెరికా బాక్సాఫీస్ నుంచి బోలెడంత షేర్ చేసుకున్నాడు కాబట్టి. ప్రమోషన్‌కు తగినట్లు డాలర్లు కురుస్తుండటంతో ఇప్పుడందరూ అమెరికా ఎన్నారైలపై పడ్డారు.
బ్రూస్ లీ అమెరికా వెళ్లకపోవడంతోనే ఆ సినిమా హిట్ కాలేదని టాక్ కూడా వచ్చింది. కానీ అఖిల్ మాత్రం ముందస్తు ప్రణాళికతో తన సినిమాకి అమెరికాలో ప్రమోషన్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో స్వీటీ అనుష్క తన సినిమా ప్రమోషన్ కోసం అమెరికా వెళుతోంది. అక్కడ చిత్రయూనిట్ సహా స్వీటీ హల్ చల్ చేయబోతోంది. అంతేకాదు ఎన్నారైల అభిరుచికి తగ్గట్టే కాస్త డిఫరెంట్‌గా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని ప్లాన్ డిజైన్ చేస్తున్నారు.