భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించాలని భావించిన పీఎస్ఎల్వీ సీ-61 రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆదివారం ఉదయం 5.59 గంటలకు చేపట్టిన ప్రయోగాన్ని పూర్తిగా విశ్లేషించిన తర్వాత ఫలితాన్ని వెల్లడించనున్నారు. మూడో దశ తర్వాత రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని, దీంతో ప్రయోగం పూర్తికాలేదని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి 101వ మిషన్ పీఎస్ఎల్వీ సీ-61ను ఆదివారం ఉదయం నింగిలోకి పంపించాలని భావించింది. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్‌ను పరిశీలిస్తున్నారు.
ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ61 మిషన్‌ను ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న షార్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించారు. ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తికాలేదని, మూడో దశ తర్వాత రాకెట్‌లో సమస్య వచ్చిందని, అన్నీ విశ్లేషించాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.