మెగాస్టార్ సరసన దేవసేన.. ఆచార్య కోసం సంప్రదింపులు..?

శనివారం, 21 మార్చి 2020 (18:17 IST)
మెగాస్టార్ చిరంజీవి 152 సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ల కోసం వేట సాగుతూనే వుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా దేవసేన అనుష్క పేరు వినిపిస్తోంది. 
 
చిరంజీవి సరసన మొదట త్రిష హీరోయిన్ ఫైనల్ చేసుకున్నారు. కానీ త్రిష కొన్ని అనివార్య కారణాలతో సినిమా నుండి తప్పుకుంది. దీంతో హీరోయిన్ వేట మొదలైంది. కాజల్ అగర్వాల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ తాజాగా చిరంజీవి సరసన అనుష్క నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.
 
ఇకపోతే.. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో తెలుగు ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ ఆపేశారు. చిరంజీవి ప్రతేక్య శ్రద్ధ తీసుకొని మరి కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా షూటింగ్ వాయిదా వేస్తున్నటు ప్రకటించారు. ఈ సినిమా దేవాదాయ శాఖ స్కామ్ నేపథ్యంలో ఆచార్య సినిమా తెరకెక్కనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు