క్రైమ్, సస్పెన్స్, త్రిల్లర్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలని చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో 750 చిత్రాలకు పైగా నటించి మెప్పించి తనికెళ్ల భరణి ప్రస్తుతం ప్రధాన పాత్రలో అసుర సంహారం అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్ మీద సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ నిర్మించనున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్నింటిని కిషోర్ శ్రీకృష్ణ హ్యాండిల్ చేయనున్నారు.