అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్తు సినీ ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవి మృతికి ఏమాత్రం నమ్మలేకపోయారు. అది నిజమని తెలిశాక జీర్ణించుకోలేకపోతున్నారు. దుబాయ్‌లో బాత్ టబ్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోయాక.. ముంబైకి ఆమె మృతదేహాన్ని తరలించారు. ఆమె అంత్యక్రియలు బుధవారం ముంబైలో జరిగాయి.
శ్రీదేవి కడచూపు కోసం ఎందరో ప్రముఖులు ఆమె నివాసానికి విచ్చేశారు. శ్రీదేవి చనిపోయిందనే బాధతో సినీ తారలంతా విషాద వదనంతో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ మాత్రం నవ్వుతూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతేగాకుండా నవ్వుతూనే తనకు కనిపించిన వారినందరినీ పలకరించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.