జగద్గురు జయేంద్ర బృందావన ప్రవేశం ఎలా జరిగిందంటే... (వీడియో)

గురువారం, 1 మార్చి 2018 (11:19 IST)
జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పూరోహిత్ హజరయ్యారు. ఈ బృందావన ప్రవేశ కార్యక్రమాన్ని జయేంద్ర సరస్వతి శిష్యబృందం పూర్తిచేశారు. ఈ బృందావన కార్యక్రమం ఎలా జరిగిందంటే... 
 
బృందావన ప్రవేశ కార్యక్రమంలో భాగంగా, గురువారం ఉదయం 7 గంటలకు అభిషేకం, తర్వాత హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేశం నలుమూలల నుంచీ వచ్చిన వేదపండితులు నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠించారు. తర్వాత ప్రత్యేక పూజ నిర్వహించి... స్వామి పార్థివదేహాన్ని బుధవారమంతా ప్రజల సందర్శనార్థం ఉంచిన ప్రధాన హాల్‌కు తీసుకెళ్తారు (మహాపెరియవర్ చంద్రశేఖరేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని ఖననం చేసిన బృందావనానికి అనుబంధంగా ఉంటుందీ హాల్‌). 
 
అక్కడ స్వామి పార్థివదేహాన్ని వెదురుబుట్టలో ఉంచి లాంఛనంగా కపాలమోక్షం కార్యక్రమం నిర్వహించి ఖననం చేస్తారు. సమాధిని మూలికలు, వస, ఉప్పు, చందనపు చెక్కలతో నింపుతారు. నందకుమార్‌, శివ స్థపతులు సమాధిని నిర్మించారు. అనంతరం దానిపై తులసి మొక్కను నాటి నీరుపోస్తారు. అలా బృందావన ప్రవేశ క్రతువును పూర్తిచేస్తారు. 


 

The final journey of Sri #JayendraSaraswathi in #Kanchipuram who passed away yesterday pic.twitter.com/W7LE9yzsP2

— T S Sudhir (@Iamtssudhir) March 1, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు