Teja-RB cowdari-Raju, kumar
తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ దక్షిణాదిలోని సుప్రసిద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం `ఇష్క్`. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. డిఫరెంట్ అటెంప్ట్‌తో హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా నిర్మాత ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ, ఓ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. ముందుగా పాండమిక్ పరిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మా సూపర్ గుడ్ ఫిలింస్‌లో వచ్చిన సినిమాలన్నీ థియేటర్స్‌లోనే విడుదలయ్యాయి. అందువల్ల ఇష్క్ సినిమాను కూడా థియేటర్స్‌లో విడుదల చేయాలని వెయిట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా నమ్మకం నిజమైంది అన్నారు.