రష్మీ గౌతమ్‌ను ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతా.. చెప్పిందెవరు?

సోమవారం, 14 మార్చి 2022 (14:50 IST)
rashmi gautham
ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్‌పై ప్రముఖ నిర్మాత ఒకరు రష్మీ గౌతమ్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బాలాజీ నాగలింగం మాట్లాడుతూ రష్మీ తమ బ్యానర్‌లో రాణిగారి బంగ్లా అనే సినిమా చేసిందని తెలిపారు. 
 
తాను ఎవరినీ కోపం వచ్చినా తిట్టనని ఆయన తెలిపారు. రష్మీ సినిమాకు ఒప్పుకుందని రష్మీ రెమ్యునరేషన్ కు అంగీకరించి షూటింగ్ లో పాల్గొందని బాలాజీ నాగలింగం చెప్పుకొచ్చారు. ఒక సాంగ్, డబ్బింగ్ బ్యాలెన్స్ ఉన్న సమయంలో రష్మీ ఇబ్బందులకు గురి చేసిందని బాలాజీ నాగలింగం వెల్లడించారు.
 
గుంటూరు టాకీస్ హిట్టైందని, రష్మీ హీరోతో సాంగ్ చేయనని తమతో చెప్పిందని హీరోను మార్చేయాలని రష్మీ అడిగిందని బాలాజీ నాగలింగం చెప్పుకొచ్చారు. రష్మీ వ్యక్తిగత కోపాలను తమపై చూపించిందని ఆ అమ్మాయి తనతో ఏం చెప్పిందో రికార్డ్ ఉందని బాలాజీ నాగలింగం వెల్లడించారు. నాగబాబు తెలుసని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసని రష్మీ బెదిరించిందని బాలాజీ నాగలింగం అన్నారు.
 
రష్మీ అలా చేయడంతో ఫిల్మ్ ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానని అన్నానని బాలాజీ నాగలింగం తెలిపారు. ఛానల్‌కు ఎక్కిస్తా అని రష్మీ బెదిరించిందని నాగలింగం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు