అన్నా వస్తున్నా... అడుగులో అడుగేస్తా : బండ్ల గణేశ్ ట్వీట్

ఆదివారం, 25 జూన్ 2023 (14:51 IST)
సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోమారు సంచలన ట్వీట్ చేశారు. అన్నా.. వస్తున్నా.. అడుగులో అడుగేస్తా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆ రాష్ట్రంలో పీపు్ల్స్ మార్చ్ చేపట్టారు. ఇందులో తాను కూడా పాల్గొననున్నట్టు సినీ నిర్మాత బండ్ల గణేశ్ వెల్లడించారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన్ను ఉద్దేశించి బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశారు. 
 
'అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను' అని బండ్ల గణేష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్‌.. ఆ పార్టీ ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు