కురచ దుస్తులపై విమర్శలా? మీ పని మీరు చూసుకోండి: అక్షయ్ కుమార్ వీడియో మెసేజ్

గురువారం, 5 జనవరి 2017 (16:11 IST)
బాలీవుడ్ సినీ నటుడు అక్షయ్ కుమార్ అమ్మాయిల దుస్తుల గురించి విమర్శించే వారికి చురకలంటించారు. అమ్మాయిల దుస్తులు పద్ధతిగా ఉండాలని క్లాస్ తీసుకునే వారిని ఉద్దేశించి అక్షయ్ కుమార్ "మీ పని మీరు చూసుకోండి" అనే సమాధానం చెప్పాలని వీడియోలో వ్యాఖ్యానించారు.

సదరు వీడియోలో పోస్ట్ చేశారు. ఐటీ రాజధాని బెంగళూరులో డిసెంబరు 31వ తేదీ అర్ధరాత్రి మహిళలపై జరిగిన వేధింపుల ఘటనపై అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ట్విట్టర్ అకౌంట్ ద్వారా వీడియో సందేశం పోస్ట్ చేశారు. అమ్మాయిల దుస్తులపై కామెంట్ చేసే వారిపై మండిపడ్డారు. 
 
రాత్రిపూట ప్రయాణం, రాత్రిపూట అమ్మాయిలు బయటికి రావాల్సిన అవసరం ఏముంది? పద్ధతిగా ధరిస్తే ఇలాంటి దురాగతాలు జరగవు కదా అంటూ బెంగళూరు ఘటనపై సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసే వారిపై అక్షయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కురచగా వున్నది వారి దుస్తులు కాదని, ఆ విధంగా మాట్లాడుతున్న వారి ఆలోచనా విధానమేనని కామెంట్ చేశారు. 
 
అమ్మాయిల అనుమతి లేకుండా వారిని తాకే హక్కు ఎవ్వరికీ లేదని అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు. అమ్మాయిలకు తమను తాము సంరక్షించుకునే శక్తి ఉందని, అబ్బాయిల అకృత్యాలను అడ్డుకోవడానికి మార్షల్ ఆర్ట్స్‌లో కొన్ని మెళకువలు ఉన్నాయన్నారు. అమ్మాయిలు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని, కొంచెం జాగ్రత్తగా ఉండటంతో పాటు, ఆత్మరక్షణ నేర్చుకోవాలని సూచించారు.

The Bangalore incident makes me feel we r evolving backwards,from humans to animals,rather beasts coz even animals are better!Truly shameful pic.twitter.com/FJwJ80Mkby

— Akshay Kumar (@akshaykumar) January 5, 2017

వెబ్దునియా పై చదవండి