అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

సెల్వి

మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (19:42 IST)
Amrita Pandey
భోజ్‌పురి నటి అమృత పాండే గత వారం ఏప్రిల్ 27న బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వయస్సు 27 సంవత్సరాలు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ, దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె మరణానికి ముందు, అమృత వాట్సాప్‌లో ఒక అస్పష్టమైన సందేశాన్ని పోస్ట్ చేసింది.
 
అందులో "అతని.. ఆమె జీవితం రెండు పడవలలో ప్రయాణించేది, ఒకటి మునిగిపోవడం ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేశాం" అని రాసి ఉంది. అయితే ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అమృత తన భర్త వద్దే ఉంటోంది. 
 
అమృత భోజ్‌పురి స్టార్ ఖేసరి లాల్ యాదవ్‌తో కలిసి 'దీవానాపన్' చిత్రంలో కనిపించింది. 'పరిశోధ్'తో సహా టీవీ షోలు, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. 
 
ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపిస్తామని సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీరాజ్ హామీ ఇచ్చారు. విచారణలో భాగంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు