మామిడాల తిరుపతి డైలాగ్‌లు రాశారు. అనిల్ సుంకర, కె.ఎస్. రామారావు నిర్మాతలు. కీర్తి సురేష్, తమన్నా, చిరంజీవి ప్రధాన తారాగణం. ఆర్టిస్టులు చాలామంది వున్నారు. కానీ చిరంజీవి మొత్తం క్యాప్సర్ చేశారు. జబర్ద్‌దస్త్ నటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇది కేవలం అన్నా చెల్లెలు కథ. చెల్లికాని చెల్లిని అన్న స్వీకరించిన కథ. తనకు ప్రాణం పోసిన అమ్మాయిని చెల్లెగా చూసుకున్నాడు. వేదాళంలో ఆ కథ తమిళంలో ఎక్కింది.
ఇక చిరంజీవి వరుసగా చాలా హత్యలు చేస్తాడు. అన్ని హత్యలు చేసినవాడు అరెస్ట్ అవ్వాలి. అది రూల్, కానీ ఇందులో అలా జరగదు. ఎందుకనో చివరిలో ఓ డైలాగ్ చిరంజీవి చెబుతాడు. నేపథ్యసంగీతం డామినేట్ చేసింది. దాంతో చిరంజీవి ఎవరు? ప్రబుత్వం ఆయన్ను హత్యలుకోసం నియమించిందా? అనేది నాకైతే అర్థంకాలేదు.
ఇక కొల్‌కత్తా బ్యాక్‌డ్రాప్ కూడా చాలా మైనస్. ఇది మన తెలుగు కథకాదు అని ప్రేక్షకులు భావించారు. ఇక అన్నాచెల్లెలు కథ కూడా సరిగ్గా సెట్ కాలేదు. ఫస్టాఫ్‌లో హత్యలు చేసి సెకండాఫ్‌లో కథ చెబితే ఎందుకు చంపుతున్నాడో తెలీక ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్‌లో వుంటాడు. ఖైదీ సినిమాలో కథను ముందుగానే చెప్పేసి ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని చూపించడంతో జనానికి నచ్చింది. కనుక హత్యలు ముందుగా చేస్తే అందుకు కారణాన్ని ముందుగా తెలపాలి. కానీ ఇప్పటి ట్రెండ్ ట్విస్ట్‌లు అంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదు.