ప్రస్తుతం ఇండియాలో బిగ్ బాస్ హవా నడుస్తోంది. అన్ని భాషల్లోనూ మంచి క్రేజున్న షోగా దూసుకుపోతోంది. తెలుగు, తమిళనాట కాస్త లేటుగా మొదలైనప్పటికీ మంచి టిఆర్‌పిలతో రెండవ సీజన్‌లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ తమిళంలో ఈ షో కారణంగా ఒక ప్రేమజంట విడిపోయింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తమిళ్ సీజన్ 1లో ఓవియా మరియు ఆరవ్ ప్రేమ కథ ఓ రేంజ్‌లో పాపులరైంది. అదేవిధంగా సీజన్ 2లో కంటెస్టెంట్‌గా ఉన్న మహత్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి రాక ముందే ప్రాచి అనే ప్రేయసి ఉంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇదే విషయం హౌస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రేక్షకులందరి ముందు కూడా చెప్పాడు. హౌస్‌లో మరో కంటెస్టెంట్ యాషికని ప్రేమించి, ప్రపోజ్ చేసాడు ఈ ప్రబుద్ధుడు. ఇందులో హైలైట్ ఏంటంటే అతడి ప్రేమను యాషిక అంగీకరించింది.