బిగ్ బాస్ ఐదో సీజన్ మొదలైంది. ఈ షో మొదలై రెండు రోజులు కూడా గడవక ముందే హౌజ్ మేట్స్ మధ్య రచ్చ రంబోలా మొదలైంది. మంగళవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్లో ప్రేక్షకులకు ఫుల్ డ్రామా లభించేలా కనిపిస్తోంది. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. మంగళవారం ఎపిసోడ్లో సిరి, లోబోల మధ్య వాగ్వాదాం తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
ఇక ఈ రోజు హౌజ్‌లో కాజల్, లహరిలకు మధ్య వాగ్వాదం జరగనుంది. కాజల్ ఎందుకు హైపర్‌గా మాట్లాడుతున్నావు.. కంటెంట్‌ను కావాలని క్రియేట్ చేయకు అంటూ లహరి అనగానే.. భావోద్వేగానికి గురైన కాజల్ కంటతడి పెట్టుకుంది. బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోను మీరూ ఓ లుక్కేయండి.