శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఐవీఆర్

మంగళవారం, 26 నవంబరు 2024 (18:03 IST)
కర్మలకు అధిపతి శని భగవానుడు. చెడు కర్మలు చేసేవారికి శని భగవానుడు శిక్షలు విధిస్తాడని విశ్వాసం. అందువల్ల శనికి తైలాభిషేకం వంటివి చేస్తుంటారు మానవులు. ఐతే మనుషులు చేసే కర్మల సంగతి అటుంచితే తాజాగా మహారాష్ట్ర లోని శని సింగ్నాపూర్ లోని శనీశ్వరుని ఆలయంలో గత 3 రోజులుగా ఓ పిల్లి విరామం లేకుండా విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. సాధారణంగా పిల్లులు మనుషులను చూస్తే పారిపోతాయి. కానీ ఇక్కడ ఆ పిల్లి మాత్రం ఎంతమంది వచ్చినా పట్టించుకోవడంలేదు. తన ప్రదక్షిణలు చేస్తూనే వుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 

మహారాష్ట్ర లోని శని సిగ్నాపూర్ లోని శని గుడిలో 3 రోజులుగా విగ్రహాన్ని విరామంగా తిరుగుతున్న పిల్లి. సాధారణంగా పిల్లులులకు మనుషులంటే భయపడి దూరంగా ఉంటాయి కానీ ఇక్కడ దేవుడి కోసం తిరుగుతుంది ఎవరికి హాని కలిగించకుండా సాధువులు సైతం ఆరాధిస్తున్నారు.. pic.twitter.com/ogO7YaYl3c

— Sandhya Reddy YSCRP ???????? (@SandhyaSamayam) November 26, 2024
కర్మలను బట్టి శనిదేవుడు ఫలితాలు
శని దేవుడిని న్యాయ దేవుడిగా, కర్మలకు అధిపతిగా భావిస్తారు. శని దేవుడు ప్రతి ఒక్కరికి తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. శని దేవుడికి ప్రత్యేక పూజలు చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని, కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఏలినాటి శని తొలగిపోతుందని విశ్వాసం.
 
శనికి తైలాభిషేకం చేయడం.. నెయ్యి లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. శని దేవునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శని మంత్రం, శని చాలీసా పఠించాలి. శనికి నలుపు రంగంటే ఇష్టమని అంటారు. అందుకని శని భగవానుడికి నలుపురంగు వస్త్రాలను దానం చేస్తే మంచిది. అలాగే నల్లని శునకానికి ఆహారం పెట్టినా కూడా ఆయన ప్రసన్నులవుతారు. శనీశ్వరునికి నువ్వులు లేదా ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు