రాజుయాదవ్ పాత్ర చేసేటప్పుడు కష్టపడిన సందర్భం ఏదైనా వుందా?
రాజు యాదవ్ పాత్ర లక్ష్మిపతి అనే క్రికెటర్ ను బేస్ చేసుకుని దర్శకుడు రాశాడు. ఆయనకు దవడలవల్ల చిన్న ఆపరేషన్ చేశారు. దాంతో ఎప్పుడూ నవ్వుతున్నట్లే అనిపిస్తుంది. అలాంటి పాత్ర నేను చేయాలి. పెదాలనుంచి ముక్కువరకు ఎటువంటి ఎక్స్ ప్రెషన్ చూపించకూడదు. కళ్ళు నొసలు, బుగ్గలతో వేరియన్స్ చూపించాలి. చాలాసార్లు అలా చేస్తున్నప్పుడు దవడలు షివర్ అయ్యేయి. అమ్మో ఇన నేను ఇలాంటి నటనకు పనికిరానేమోనని భయం వేసింది. ఉదయం షాట్ మొదలు పెడితే సాయంత్రం వరకు అలాంటి ఫీలింగ్ పేస్ లో చూపించాలి. ఓ దశలో అనసరంగా ఒప్పుకున్నానేమో అనిపించేది.
హీరోగా రాజుయాదవ్ ఎలా వుండబోతోంది?
నన్ను హీరో అనకండి. అలా అనిపించుకోవడం ఇష్టం లేదు. నేను కథలో లీడ్ రోల్ చేశానంతే. ముందుముందు అవసరమైతే క్యారెక్టర్ లు కూడా చేస్తాను.