చిరంజీవి భావోద్వేగ ట్వీట్... నాన్నా చరణ్.. గర్వంగా వుంది..
శనివారం, 3 డిశెంబరు 2022 (17:26 IST)
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ను తలచి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేశారు. చెర్రీకి ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి గర్వంగా వుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డుల్లో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చెర్రీ ట్రూ లెజెండ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
"నాన్నా చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు నాకు సంతోషంగా, గర్వంగా వుంది. నువ్వు ఇలా ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం.. అంటూ పోస్టు చేశారు.
ఈ పోస్టుకు రామ్‌చరణ్ అవార్డు అందుకుంటున్న ఫొటోలను సైతం జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.