మెగాస్టార్ చిరంజీవి తన 154 చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. సోమవారంనాడు సెట్‌కు హాజరై అక్కడ తొలుత కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయనతో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ప్రకాష్‌రాజ్ కూడా కృష్ణంరాజుతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నటనాపరంగా కృష్ణంరాజును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.