chiru-tamalisai and others
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 25 ఏళ్లుగా సేవలందిస్తుందని చెప్పారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 9లక్షల 30వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం అసాధారణ విషయమన్నారు. వీటిలో 79% పేదలకు, అణగారిన వర్గాలకు ఉచితంగా పంపిణీ చేశారు, మిగిలిన యూనిట్లను కార్పొరేట్ ఆసుపత్రులకు నామమాత్ర రుసుముకు అందజేసినట్లు గవర్నర్ చెప్పారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఐబ్యాంక్ కూడా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 4,580 జతల కళ్లు సేకరించినట్లు చెప్పారు. వీటి ద్వారా 9,060 మంది అంధులకు చూపు తెప్పించారన్నారు. ఇవే కాకుండా కరోనా మహమ్మారి సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అద్భుతమైన సేవలు అందించిందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారని అన్నారు.