''ఖైదీ నంబర్ 150'' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా దర్శకరత్న దాసరినారాయణరావు, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు విచ్చేస్తారని రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించాడు. వీరితో పాటు చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తారని చెర్రీ చెప్పాడు. అలాగే పవన్ కల్యాణ్‌కు కూడా ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నట్లు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చెర్రీ ధీటుగా సమాధానం ఇచ్చాడు.
''ఖైదీ నంబర్ 150'' ప్రీ రిలీజ్ వేడుకకు విజయవాడలో అనుమతి నిరాకరించడంతో గుంటూరు సమీపంలోని మంగళగిరి అగ్రిగోల్డ్ హాయ్‌ల్యాండ్‌లో ఈ వేడుక జరుగనుంది. జనవరి 7న అతిరథ మహారథుల సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరపనున్నట్లు అల్లు అరవింద్ ఇది వరకే ప్రకటించారు. అయితే చిత్ర నిర్మాత అయిన రామ్‌చరణ్ ఫారిన్ టూర్‌లో ఉండడంతో అక్కడి నుంచే ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను తెలియజేశాడు.
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సెన్సార్ అయినప్పటి నుంచి ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో విభిన్నాభిప్రాయాలు వెల్లడైంది. సినిమా సూపర్ అని మెగా ఫ్యాన్స్ ప్రచారం చేసుకుంటున్నారు. ఇక మరో టాక్ ఏంటంటే సినిమా అవుట్ ఫుట్ యావరేజ్ అని మరో టాక్ వినవస్తోంది. ఎవరి టాక్ ఎలా ఉన్నా సెన్సార్ సభ్యుల నుంచి లీక్ అయ్యిందంటూ ఓ టాక్ ప్రచారంలో ఉంది.
సెన్సార్ టాక్ అంటూ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తోన్న టాక్ చూస్తే ఖైదీ నెంబర్ 150 యావరేజ్ అంటున్నారు. ఈ సినిమా చిరు ఫ్యాన్స్‌కి నచ్చేలా తీయడంలో వినాయక్ విజయవంతం అయినట్టు టాక్. చిరు 10 ఏళ్ల తర్వాత వెండితెరమీద కనిపించినా ఆయనలో జోష్ ఏ మాత్రం తగ్గలేదట. ఇక చిరు డైలాగ్స్, డ్యాన్సులతో కుమ్మేసినట్టు తెలుస్తోంది.