విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రం విడుదలకు ముందు.. విడుదల తర్వాత పెను వివాదమే సృష్టించింది. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం తొలుత శర్వానంద్‌కు వచ్చింది. కానీ, అతను నటించలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు రావడంతో ఆయన ఓకే చెప్పారు. ఫలితంగా తన ఖాతాలో ఓ మంచి విజయాన్ని వేసుకున్నారు.