సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినందున, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింతపెరుగుతున్నాయి, ఇవన్నీ మిలియన్ల వ్యూస్ మైలురాయిని చేరుకున్నాయి. ఇప్పుడు, ఈ చిత్రం మార్చి 27, 2025న తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.