ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ రష్మిక మందన్న డీప్ న్యూడ్ ఫోటోలు హల్చల్ చేశాయి. ఈ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించారు. ఈ షాకింగ్ ఘటన నుంచి తేరుకోకముందే ఇపుడు మరో హీరోయిన్ కాజోల్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. కాజోల్ దుస్తులు మార్చుకున్న డీప్‍ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాజోల్ బికినీ వీడియో పేరుతో 1మింట్ ఆర్ట్ ఖాతా ద్వారా యూట్యూబ్‌లో కూడా ఇలాంటి వీడియో ఒకటి షేర్ అయింది. చాలా మంది యూజర్లు ఈ వీడియోను కాజోల్‌దే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించగా అది డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ఈ వీడియో కోసం శోధిస్తే వాస్తవ తనిఖీ వెబ్‌సైట్ బూమ్ లైవ్ ప్రచురించిన వార్తాకథనం లభించింది. బూమ్ లైవ్ టిక్ టాక్‌లో ఈ వీడియో అసలైనదిగా గుర్తించారు.