సస్పెన్స్‌కు తెరపడింది... ఒక్కటికానున్న మరో బాలీవుడ్ ప్రేమజంట

సోమవారం, 22 అక్టోబరు 2018 (14:38 IST)
నెలల తరబడి కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. బాలీవుడ్ జంట దీపికా పదుకోనె, రణ్‌వీర్ సింగ్‌లు పెళ్లిపీటలెక్కనున్నారు. తమ పెళ్లి తేదీని ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించేశారు. ఇద్దరూ నాలుగు నిమిషాల వ్యవధిలో తమ పెళ్లి తేదీలను బహిర్గతం చేస్తూ ట్వీట్లు చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో తమ పెళ్లి జరగనున్నట్లు దీపికా, రణ్‌వీర్ సింగ్ వెల్లడించారు. ఇద్దరి కుటుంబాల ఆశీస్సులతో తమ పెళ్లి తేదీ ప్రకటిస్తున్నట్లు వీళ్లు చెప్పారు.
 
'మా కుటుంబసభ్యుల దీవెనలతో నవంబర్ 14, 15 తేదీల్లో మా వివాహ వేడుక జరగనుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. గత కొన్నేళ్లుగా మాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. మేమిద్దరం పెళ్లితో ఒకటవబోతున్నాం. ఈ సందర్భంగా మీ దీవెనలను కోరుకుంటున్నాం' అంటూ తమ ప్రకటనలో తెలిపారు. 
 
నిజానికి వీరిద్దరూ కొన్నేళ్లుగా వీళ్లద్దరూ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. న‌వంబ‌ర్‌లోనే వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని, దీనికోసం దీపికా షాపింగ్ కూడా చేస్తున్న‌ద‌ని గ‌తంలో ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ఇప్ప‌టికే పెళ్లి త‌ర్వాత ఉండాల్సిన ఇంటిని కూడా త‌మ అభిరుచికి త‌గిన‌ట్లు వీళ్లు మ‌ల‌చుకున్నారు. అయినా వీళ్లు మాత్రం ఎప్పుడూ త‌మ పెళ్లి విష‌యంలో బ‌య‌ట‌ప‌డ‌లేదు. 
 
అయితే, ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా తన రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయింది. ఈ ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ మూవీల్లో ఈ జంట చూడముచ్చటగా ఉంది. ఇక పద్మావత్‌లోనూ ఈ ఇద్దరూ కనిపించినా.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. రణ్‌వీర్ ఖిల్జీగా, దీపికా రాణి పద్మిణిగా నటించిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు