తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'ఏ మాయ చేసావే' సినిమా కోసం మొదట మహేష్ బాబును అనుకున్నాం. కానీ అందులో యాక్షన్ లేదని వదులుకున్నారు. అప్పట్లో చిరంజీవి చివరిలో అతిథి పాత్రలో కనిపించేలా ప్లాన్ చేశాం. ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళ విన్నైతాండి వరువాయా రీమేక్ 'యే మాయ చేసావే' సినిమా. మాత్రుకలో శింబు, త్రిష చేశారు.