Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

దేవీ

బుధవారం, 2 జులై 2025 (14:10 IST)
Dil Raju
సినిమా నిర్మించి, పంపిణీ చేశాక థియేటర్ లో విడుదలచేశాక కొందరు థియేటర్లలో వెనుకసీటులో కూర్చుని పైరసీ చేస్తున్నారు. ఇది శ్రమదోపిడీ. నటీనటులు, నిర్మాత, దర్శకుల కష్టాన్ని దోచేస్తున్నారంటూ దిల్ రాజు వాపోయారు. ఇటీవలే విడుదలైన కుబేర సినిమా రిలీజ్ లో జరిగిన సంఘటను చెప్పుకొచ్చారు. అలాగే రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా ప్లాప్ అయితే మా సోదరుడు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో మరోరకంగా ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అది వైరల్ అయింది. ఇలాంటివి చేయడం కూడా దోపీడికిందకే వస్తుంది.
 
మా సోదరుడు శిరీష్ సహజంగా మాట్లాడడు. కానీ తను మాట్లాడితే ఇలా మీడియా గొడవ చేస్తుంది. అందుకే గేమ్ ఛేంజర్ గురించి మీడియా  నన్ను అడగవద్దు అంటూ కండిషన్ పెట్టారు. ఇక రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తామ్. కానీ కథ వుంటే చెప్పండంటూ మీడియాకు సెటైర్ వేశారు.
 
నేను ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా  గద్దర్ అవార్డ్ లు చేశాం. అది సక్సెస్ కిందే లెక్క. అలాగే మరో పెద్ద అంశం వుంది. అదే అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం. గత కొంతకాలంగా హైదరాబాద్ లో జరగడంలేదు. అందుకే నా ఆధ్వర్యంలో మరలా హైదరాబాద్ లో చేయబోతున్నాం. అదేవిధంగా స్వంతంగా భవనాన్ని ఏర్పాటు చేసే దిశగా గతంలో పెద్దలు, ప్రభుత్వాలు హామీ ఇచ్చారు. అది సాధ్యపడితే చేసే దిశగా ప్రయత్నాలు చేయబోతున్నా అన్నారు.
 
అదేవిధంగా సినిమా ప్రమోషన్ లో బాగంగా కొందరు ఇంటర్వ్యూ చేశాక, దానిలో కొంత అక్కడక్కడ కట్ చేసి థంబ్ లైన్ పెట్టి వైరల్ చేసుకుంటున్నారు. వాటిల్లో నిజం వుండదు. దాన్ని కంట్రోల్ చేయాలంటే సంబంధిత మీడియా అధినేతలతో మాట్లాడే ఆలోచన వుందనీ, దానికి అందరూ కలసి రావాలనీ, అది సాధ్యపడుతుందో లేదో చెప్పలేనని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు