సమంత, విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమా కథపై సోషల్ మీడియాలో చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సమంత లవ్ స్టోరీని దర్శకుడు తెరకెక్కించానే వార్తలు బయటకు వచ్చాయి. ట్రైలర్‌లో.. విజయ్, సమంత వివాహం చేసుకుని ఆదర్శంగా నిలవాలని శపథం చేసి పెండ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత చిన్నపాటి తగాదాలు చోటుచేసుకుంటాయి. ఓ సందర్భంలో సమంత అడిగిన ప్రశ్నలకు చిరాకెత్తిన విజయ్ దేవరకొండ తలుపు గట్టిగా వేస్తాడు. ఎందుకు అలా వేశావ్. అంటుంది.