జక్కన్నకు మరో గౌరవం.. ISBC చైర్మ‌న్‌గా నియామకం

శనివారం, 1 జులై 2023 (12:42 IST)
బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న జక్కన్న రాజమౌళికి మరో గౌరవం దక్కింది.
 
గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్స్‌గా ఎదగాలనుకునే వారిని గుర్తించి.. వారిలోని ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించేందుకు మాజీ క్రికెట‌ర్ దిలీప్ వెంగ్ స‌ర్కార్ గైడెన్స్‌లో ఇండియ‌న్ స్కూల్స్ బోర్డ్ ఫ‌ర్ క్రికెట్ (ISBC) ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ ఇండియ‌న్ స్కూల్స్ బోర్డ్ ఫ‌ర్ క్రికెట్ (ISBC) చైర్మ‌న్‌గా రాజ‌మౌళి నియ‌మితుల‌య్యారు. 
 
ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆర్ఆర్ఆర్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో సినిమా చేయ‌టానికి రాజ‌మౌళి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు