Director Vijay Kanakamedala
ప్రస్తుతం తెలుగు సినిమాలలో చిన్నపాటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమా స్థాయికి వెళ్ళాలని తహతహలాడుతున్నారు. అగ్ర హీరోలకు అగ్ర దర్శకులు అందలమెక్కిస్తే చిన్నహీరోలను తమను కూడా ఎవరైనా ఆదుకుంటారేమో చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఇటీవలే నాని సినిమాలు కూడా సక్సెస్ అవడం రెండు మూడు భాషల్లో విడుదల కావడంతో పాన్ ఇండియా హీరోగా నాని మారిపోయాడు. నేచురల్ స్టార్ నాని అనే పేరు కూడా ఫిక్స్ అయిపోయింది. మనింటి కుర్రాడు, పక్కింటి కుర్రాడు తరహాలో పెద్దలు కూడా ఆయన్ను రిసీవ్ చేసుకుంటున్నారు.