నటీనటుల మధ్య తారతమ్యాలు, మనస్పర్థలు వుండడం మామూలే. పరబాషా నటుల మధ్య మరీ ఎక్కువగా వుంటుంది. కన్నడ నటుడు ఉపేంద్ర భిన్నమైన పాత్రలు పోషించి అందరినీ ఆశ్చర్యపరిచేలా పాత్రలు వేసేవాడు. టైటిల్స్ కూడా `రా`, ? - వంటి చిత్రమైనవి పెట్టి పజిల్‌గా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అలాంటి ఆయనకు అభిమానులుకూడా చాలా మందే వున్నారు. అది కన్నడలో అయితే పర్వాలేదు. తెలుగులోకూడా అభిమానులుండడంతో కొన్ని సినిమాలు అప్పట్లో సక్సెస్ అయ్యాయి. అలాంటి ఉపేంద్రతో రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ ఓ కథను రాసుకుని ఆయన చెప్పాడు. ఓకే అన్నాడు. దర్శకత్వం కూడా నేనే చేస్తాను. నువ్వు నటించాలి అని ఉపేంద్రను అడగంతో ఉపేంద్రకు ఇగో హర్ట్ అయింది.