జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'కింగ్ ఆఫ్ కొత' చిత్రం షూటింగ్ తమిళనాడులోని కరైకుడిలో జరుగుతోంది. అభిలాష్ ఎన్ చంద్రన్ రాసిన ఈ చిత్రం పాన్-ఇండియన్ స్టార్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ , ఎడిటర్ గా శ్యామ్ శశిధరన్ పని చేస్తుండగా.. జేక్స్ బిజోయ్ , షాన్ రెహమాన్ కలసి సంగీతం అందిస్తున్నారు.