సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వున్నదంటూ ఈమధ్య నటి శ్రీరెడ్డి ఇస్తున్న ఇంటర్వ్యూలపై ఇప్పుడిప్పుడే తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పెద్దపెద్ద ప్రొడక్షన్ హౌసులలో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఎవరో ఇండస్ట్రీ పేరు చెప్పుకుని పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ మోసగించేవారు వుండొచ్చు. అలాంటి ప్రకటనలు గతంలో నా దృష్టికి వచ్చినప్పుడు పత్రిక యాజమాన్యాలకు ఫోన్లు చేసి వాస్తవాలు తెలుసుకుని ఆ ప్రకటనలు తీయించేసినట్లు చెప్పుకొచ్చారు.
ఐతే ఈమధ్య కొంతమంది అమ్మాయిలు కాస్టింగ్ కౌచ్ మీద టీవీ ఛానల్స్‌కు వచ్చి మాట్లాడటాన్ని చూసాను. ఇలాంటివి నిజమేనని కూడా చాలాసార్లు చెప్పాను. ఎక్కడో ఒకరిద్దరు ఇలాంటివి చేస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం అలాగే అని మాట్లాడటం మంచిది కాదు. అలా ప్రవర్తించేవారు ఎవరో వారి పేర్లను డైరెక్టుగా చెప్పేస్తే చర్యలు తీసుకోవడం సుళువవుతుందని అన్నారు.