ఆ మేరకు హైదరాబాద్ లోని గౌరవనీయ సిటీ సివిల్ కోర్టు 48 గంటల లోగా అనగా ఆదివారం సాయంత్రం 4-30 గంటలు లోగా Rs. 65,00,000/- (అరవై ఐదు లక్షల రూపాయలు) సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టులో శ్రీమతి జీవిత రాజశేఖర్ సమర్పించాలని, ఒకవేళ అలా డిపాజిట్ చేయలేనిపక్షంలో ''శేఖర్" సినిమాకు సంబందించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్)అటాచ్ మెంట్ చేస్తూ అనగా థియేటర్స్ లో కానీ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఎటీటీ, యూట్యూబ్ వంటి వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో సినిమా తోపాటు ట్రైలర్ స్ ,పాటలతోసహ ఎలాంటి కంటెంట్ ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటాచ్ మెంట్ అమలులోకి వస్తే, ఆదివారం సాయంత్రం తర్వాత 'శేఖర్" సినిమాను ఏ ఫ్లాట్ ఫామ్స్ లో ఎవరు ప్రదర్శించినా CONTEMPT OF COURT అవుతుందని ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన కోర్టు కాపీని మీడియాకు విడుదల చేశారు.