మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ..యూట్యూబ్ వారే తంబ్ నెల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు. ఓ ఫంక్షన్‌లో చిరంజీవిగారు అటెండ్ అయ్యారు. మేం అప్పటికే సభపైకి ఎక్కి మాట్లాడి దిగుతున్నాం. చిరంజీవిగారిని చూడనేలేదు. కానీ చిరంజీవిగారు రాగానే జీవితా రాజశేఖర్ వెళ్ళిపోతున్నారంటూ తెగ ప్రచారం చేసేశారు.
అలాగే మరోసారి ఆయన ఎవరినో చేయి చూపిస్తూ మాట్లాడుతుంటే, ఇంకేముంది.. ఆయన జీవితా రాజశేఖర్‌వైపే చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నారంటూ. ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియా, యూట్యూబ్ వారు రాసేశారు. ఇలాంటివి ఒకసారి ఆలోచించాలని ఆ మీడియాకు చురకలేసింది. మీకూ ఇంటిలో ప్యామిలీ ఉంటుంది. మీకు ఏదైనా సమస్యలు వస్తాయి. ఇలాగే రాస్తే మీకెలా అనిపిస్తుంది అంటూ చురకలేసింది.
అసలు చిరంజీవిగారు, రాజశేఖర్‌గారు కలిసి నటించాలని అనుకున్నారు. కానీ ఈ గొడవల వల్ల కొందరు పడనీయకుండా చేసినట్లుగా వుందంటూ, ధృవ సినిమాలో విలన్‌గా రాజశేఖర్ గారు చేస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ సాధ్యపడలేదు అంటూ వివరించారు.