దర్శకుడు విద్యాధర్ కాగిత మాట్లాడుతూ.. అతని అతిపెద్ద భయం మానవ స్పర్శే. అతని లోతైన కోరిక మానవ స్పర్శే. మానవ స్పర్శ లేని జీవితాన్ని ఊహించలేం. అలాంటి సమస్య ఎదుర్కుంటున్న అఘోర శంకర్ (విశ్వక్ సేన్) హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణం, దీనితో పాటు సమాంతరంగా కొన్ని పాత్రలు నడుస్తుంటాయి. వాటి ప్రయాణం ఘోర ప్రయాణంతో ఎలా ముడిపడి వుంది, చివరగా అఘోర తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది గామి కథాంశం. ఆడియన్స్ కి ఇప్పటివరకూ ఇవ్వని కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం. ఈ సినిమా విజువల్స్ ని రాబట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. విశ్వక్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఏది అడిగితే అది చేశారు. ఈ సినిమా కోసం కుంభామేళని క్యాప్చర్ చేశాం. మైనస్40డిగ్రీల వద్ద కూడా గ్లౌజులు లేకుండా నటించాడు. నిజమైన మంచులో పేరుకుపోయి చేసిన సన్నివేశాలు చాలా వున్నాయి. అవన్నీ మార్చి 8న చూడబోతున్నారు. ఇప్పటివరకూ ప్రేక్షకులు పొందని అనుభూతిని పొందుతారని కోరుకుంటున్నాం అన్నారు
ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.
తారాగణం:- విశ్వక్ సేన్, చాందిని చౌదరి, M G అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్