అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు

సోమవారం, 21 నవంబరు 2022 (09:15 IST)
Pawan Kalyan
పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవికి అవార్డ్ రావడం పట్ల ఆనందం వ్యక్థమ్ చేశారు. ఓ ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు. తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. 
 
ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని  పవన్ కళ్యాణ్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు