తన భార్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అని ఆమె గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అని సోనూసూద్ వ్యాఖ్యానించారు. తనకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు సెకండ్ హోం వంటివని వ్యాఖ్యానించారు సోనూసూద్.
ఇదంతా చెబుతూ అర్థరాత్రి వేళ కొంతమంది చేసే ఫోన్ల కారణంగా తాను బాగా ఇబ్బందిపడుతున్నానంటున్నాడు. అయితే ఒక్కసారి సాయం చేయాలనే ఆలోచన వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానంటున్నాడు. ప్రస్తుతం సోనూసూద్ తెలుగు సినీపరిశ్రమలో విలన్ కాదు, హీరో అంటూ అభిమానులు చెబుతున్నారు.