ఈ ప్రజల పరిస్థితులని గమనిస్తున్న కొందరు సినీ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా ద్వారా అవసరమైన వారికి తన వంతు సాయం చేస్తానని పేర్కొంది.
ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు.. ఇలా ఏదైన అవసరం అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. నా వంతు సాయం చేస్తాను. గత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయం మాత్రం చేయలేను అని రేణూ వ్యాఖ్యానించారు..