మలయాళంలో వచ్చిన 'కలి' చిత్రాన్ని ‘హేయ్.. పిల్లగాడ’ పేరిట తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సమీర్ తాహిర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా వచ్చేనెల 8న విడుదల కానుంది. ఇక టీజర్లో ప్రధానంగా హీరో, హీరోయిన్లు కాలేజీ నేపథ్యంలో సాగే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. హీరో దుల్కర్ సల్మాన్ ఫైటింగులతో అదరగొడితే.. ఫిదా హీరోయిన్ లుక్ పరంగా బాగుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు.