మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఠాగూర్

ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (17:14 IST)
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగికి జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టు జైలు అధికారులు వెల్లడించారు. గర్భందాల్చినందునే ఆమెను ప్రస్తుతం ఉన్న జైలుగది నుంచి తరలించనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆమెతో పాటు గర్భంతో ఉన్న మరో మహిళ ఖైదీని కూడా తరలించనున్నారు. 
 
"గర్భిణీ ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారక్‌లోకి పంపుతాం. బిడ్డ జన్మించేంత వరకు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు" అని జైలు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను తన ప్రియుడితో కలిసి ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసింది. నిందితులిద్దరు ప్రస్తుం జైలులో ఉన్నారు. 
 
ముస్కాన్‌కు ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె గర్భందాల్చినట్టు తెలిసింది. ఆమె గర్భందాల్చడంపై ఇటీవల బాధిత కుటుంబం స్పందించింది. ఒకవేళ బయోలాజికల్‌గా కడుపులోని బిడ్డ సౌరభ్ చెందినది అయితే దత్తత తీసుకుంటామని, ఆ బిడ్డను పెంచుకునేందుకు తమకు ఇష్టమేనని వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు