మెగాస్టార్ సరసన హ్యూమా ఖురేషి... నిరాశలో అనుష్క...

శుక్రవారం, 9 నవంబరు 2018 (15:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం వచ్చే యేడాది వేసవికి ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అదేసమయంలో చిరంజీవి తన 152వ చిత్రంపై దృష్టిసారించారు. ఈ చిత్రానికి "భరత్ అనే నేను"తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం 152వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా కొర‌టాల శివ ఉన్నాడు‌. 
 
అదేసమయంలో ఈ చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక చర్చలు జరుపుతున్నారు. కాజ‌ల్, న‌య‌నతారలు ఇప్ప‌టికే చిరంజీవి రీఎంట్రీ మూవీల‌లో న‌టించేయ‌డంతో ఒక మిగిలింది అనుష్క‌. దీంతో 152వ చిత్రంలో అనుష్కను ఎంపిక చేస్తారని అందరూ భావించారు. 
 
ఈ తరుణంలో బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖ‌రేషిని సంప్ర‌దిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తున్న‌ది. ఇటీవ‌ల హ్యుమా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మూవీలో కూడా న‌టించింది. దీంతో ఆమె చిరంజీవి స‌ర‌స‌న సరిగ్గా సరిపోతుందని దర్శకుడు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు