2018 సంవత్సరంలో హీరో పాత్రలకు గుడ్ బై చెప్పాడు సునీల్. ఇప్పటివరకు హీరోగా ఒక్క మూవీ కూడా ఒప్పుకోలేదు. కానీ ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలను మాత్రమే చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు సునీల్. కమెడియన్‌గానే కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. 2017 సంవత్సరం చివరలో 2 కంట్రీస్ సినిమా రిలీజైంది. ఆ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. అంతకుముందు విడుదలైన సునీల్ సినిమాలు అదేవిధంగా ఫ్లాపయ్యాయి.
ప్రస్తుతం సునీల్ భీమినేని దర్సకత్వంలో నటిస్తున్నాడు. అలాగే రవితేజ హీరోగా శ్రీనువైట్ల తీస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ కొట్టాడు. తాజాగా రాజశేఖర్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడు. ఇలా వరుసగా నాలుగు చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలను పోషించనున్నాడట. హీరోగా అచ్చిరాలేదు కాబట్టి కమెడియన్‌గానే ఉండిపోవాలన్న ఆలోచనలో ఉన్నారట సునీల్.