తండ్రి, కూతుళ్ల ఎమోషన్స్ తో ఆకట్టుకునే నేను మీకు బాగా కావాల్సినవాడిని - నిర్మాత కోడి దివ్య దీప్తి
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:02 IST)
Kodi Divya Deepti
నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అలాగే అండర్ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని విత్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో డిస్కస్ చేశాం.ఈ సినిమా చూసిన ప్రతి అమ్మాయి, ప్రతి ఫ్యామిలీ అడియన్స్ అందరూ రియాక్ట్ అవుతారు.అలాగే ఫాదర్, డాటర్ మధ్యలో ఉండే రిలేషన్ షిప్ ను ఎలివేట్ చేశామని`నిర్మాత కోడి దివ్య దీప్తి అన్నారు.
దర్శకుడిగా నటుడిగా తెలుగు ప్రేక్షకుల హ్రుదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న కమర్సియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో కిరణ్ అబ్బవరం,సంజన ఆనంద్, సిధ్ధార్ద్ మీనన్, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్కర్,సోను ఠాగూర్, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి పాత్రికేయులతో పలు విషయాలు తెలియజేశారు.
- నా మొదటి సినిమా నాకు కొంచెం నెర్వస్ గా ఉన్నా మంచి సినిమాతో హిట్ కొట్టాలని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము.సినిమా ఔట్‌పుట్ విషయంలో యూనిట్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం.సినిమా చాలా బాగా వచ్చింది. బిజినెస్ పరంగా కూడా చాలా హ్యాపీ గా వున్నాము. ఇన్నిరోజుల మా కష్టానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను ఓవర్ సీస్ లో కాకుండా ఇండియా వరకే 550 పైగా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము.
- ఈ సినిమాకు చాలా టైటిల్స్ అనుకున్నాము కానీ "SR కళ్యాణ మండపం" లోని నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే డైలాగ్స్ అడియన్స్ కు బాగా రీచ్ అయ్యింది. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాము. అయితే ఈ కథకు ఈ సినిమా టైటిల్ బాగా కుదిరింది.
- ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అలాగే అండర్ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్ పాయింట్‌ని విత్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో డిస్కస్ చేశాం.ఈ సినిమా చూసిన ప్రతి అమ్మాయి, ప్రతి ఫ్యామిలీ అడియన్స్ అందరూ రియాక్ట్ అవుతారు.అలాగే ఫాదర్, డాటర్ మధ్యలో ఉండే రిలేషన్ షిప్ ను ఎలివేట్ చేశాము.
- ఈ సినిమాలో తక్కువ పాత్రలు ఉన్నా అడియన్స్ కు కొత్త పాత్రలు ఉంటే బాగా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో దర్శక, నిర్మాత ఎస్. వి కృష్ణారెడ్డి గారిని , కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ లను తీసుకోవడం జరిగింది. అయితే మేము అనుకున్నట్లే కిరణ్ అబ్బవరం, బాబా భాస్కర్ ల ట్రాక్ లతో పాటు ఎస్. వి కృష్ణారెడ్డి, సంజనల ఎమోషన్స్ అలాగే తండ్రి కూతుళ్లు ఎమోషన్స్ కు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతారు .
- మణి శర్మ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే తను మా కు ఆరు అద్భుతమైన వెరియేషన్స్ ఉన్న పాటలు ఇచ్చాడు. ఇందులో ఇక మెలోడీ, ఒక స్పెషల్ సాంగ్ ఇలా ఈ సినిమాకు పాటలు ప్లస్ అనుకుంటాను. అలాగే ఆయనిచ్చిన ఆర్ ఆర్ ఈ సినిమాకు మరొ హైలెట్ అవుతుంది.. కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేశాడు. అయన రాసిన డైలాగ్స్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అవుతాయి. కోవిడ్ వలన కొన్ని ఇబ్బందులు ఎదురైనా డైరెక్టర్ , కెమెరా మెన్ లతో పాటు నటీ నటులు అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా అవుట్ పుట్ బాగావచ్చింది అందుకే హిట్ కొడతామనే నమ్మకం ఉంది.
- పవన్ కల్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేసి, మా అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.మా డాడీ మీద ఉన్న అభిమానం తో మీ సినిమా సక్సెస్ కావాలని చెప్పారు.ఫైట్ సెక్వెన్స్ నచ్చాయి. డి.ఓ.పి కి కంగ్రాట్స్ చెప్పి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
- మంచి సినిమాలు తీద్దాం అని చాలా రోజులనుంచి ఉంది.అది ఇప్పటికి కుదిరింది.అయితే ప్రొడక్షన్ అనేది ప్రతిరోజు ఒక ఛాలెంజ్ లా అనిపించింది. అయితే అది హడిల్స్ లా అనుకోకుండా ఇది ఒక ఎక్స్పీరియన్స్ లా నేర్చుకుంటూ వర్క్ చేశాను.
- చిన్నప్పటి నుండి నాకు డైరెక్షన్ అంటే ఇష్టం.నేను నాన్న గారు ఉన్నపుడే నేను 2,3 కథలు రెడీ చేసుకున్నాను. భవిష్యత్తులో నా దర్శకత్వంలో సినిమాలు వచ్చే అవకాశం ఉంది.
- ఈ సినిమా రిలీజ్ అయిన పది రోజుల తర్వాత మళ్ళీ మంచి సినిమాతో మీ ముందుకు వస్తాను. మా బ్యానర్ లో పెద్ద స్క్రిప్ట్స్ వస్తే పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తాము.ఏదైనా స్క్రిప్ట్ ను బట్టి బడ్జెట్ సినిమాలు చేస్తాను అని తెలిపారు.