స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. బన్నీ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆలోచనలో పడ్డ బన్నీ ఇక నుంచి కథల విషయంలో చాలా కేర్ తీసుకోవాలనుకుంటున్నాడట. చాలా కథలు విని ఆఖరికి బన్నీ మనం ఫేమ్ విక్రమ్ కుమార్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే... బన్నీ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ భారీ చిత్రాన్ని సుమారు 100 కోట్లతో రూపొందించనున్నారని సమాచారం. ఆగష్టులో ఈ మూవీని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇందులో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది తెలియాల్సివుంది.